శర్వానంద్-శ్రీను వైట్ల కాంబినేషన్‌లో మొదలుపెడుతున్న సినిమాకు జార్జ్ క్రిష్ అనే టైటిల్ ఖరారు చేశారు. ఈ సినిమా పూజా కార్యక్రమం నిన్న జరిగింది. సంక్రాంతికి జార్జ్ క్రిష్ వస్తున్నట్లు ప్రకటించారు. కనుక త్వరలో డిసెంబర్ నెలాఖరులోగా పోస్ట్ ప్రొడక్షన్ పనులు ముగియాలంటే వెంటనే రెగ్యులర్ షూటింగ్ మొదలుపెట్టాల్సి ఉంటుంది.
ఈ సినిమాకు కథ, స్క్రీన్ ప్లే: గోపీ మోహన్, సంగీతం: అనుప్ రూబెన్స్, కెమెరా: కేవీ గుహన్, ఆర్ట్: కొల్ల అవినాష్, ఎడిటింగ్: అమర్ రెడ్డి చేస్తున్నారు.
ఏకే ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై అనిల్ సుంకర, అజయ్ సుంకర, రామబ్రహ్మం సుంకర, కిషోర్ గరికపాటి కలిసి నిర్మిస్తున్న జార్జ్ క్రిష్ 2027, జనవరి 14న సంక్రాంతి పండుగ రోజున విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు.