వీసా వింటారా సరదాగా.. నేడే టీజర్‌ రిలీజ్‌

August 14, 2026


img

కొత్త దర్శకుడు ఉద్భవ్ దర్శకత్వంలో అశోక్ గల్లా, శ్రీగౌరీ ప్రియ జంటగా చేస్తున్న ‘వీసా.. వింటారా సరదాగా’ సినిమా టీజర్‌ జూలై 12న ఒకటి విడుదల చేశారు. శుక్రవారం సాయంత్రం 4.06 గంటలకు మరో టీజర్‌ విడుదల చేయబోతున్నారు.  

అమెరికాలో ఉన్నత చదువులు చదివి ఉద్యోగం సంపాదించి అక్కడే స్థిరపడాలని కోరుకునే భారతీయ యువత కలల చుట్టూ అల్లుకున్నదే ఈ సినిమా కథ. 

ఈ సినిమాలో శ్రీగౌరీ ప్రియ, శివాత్మిక రాజశేఖర్, రాహుల్ విజయ్, హర్ష చెముడు తదితరులు ముఖ్య పాత్రలు చేస్తున్నారు. ఈ సినిమాకు సంగీతం విజయ్‌ బల్గానిన్ అందిస్తున్నారు. 

సితారా ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్న ఈ సినిమాకు సంగీతం: విజయ్ బుల్గానిన్ అందిస్తున్నారు. ఈ సినిమా రిలీజ్‌ డేట్ ఇంకా ప్రకటించాల్సి ఉంది. బహుశః నేడు టీజర్‌లో ప్రకటించే అవకాశం ఉంది. 


Related Post

సినిమా స‌మీక్ష