పోతురాజుగా శ్రీహరి తనయుడు.. ఫస్ట్ లుక్

August 15, 2026


img

దివంగత సినీ నటుడు శ్రీహరి తనయుడు మేఘాంశ్ శ్రీహరి 2019లో టాలీవుడ్‌లో హీరోగా ప్రవేశించి ‘రాజ్ దూత్’, ‘కోతి కొమ్మచి’, ‘అతని పేరు’ మూడు సినిమాలు చేశాడు. వాటితో మంచి నటుడుగా గుర్తింపు సంపాదించుకోగలిగాడు కానీ సరైన హిట్ పడకపోవడంతో కాస్త గ్యాప్ తీసుకొని లెల్లా రోహిత్ దర్శకత్వంలో మరో సినిమా చేస్తున్నాడు. నేడు శ్రీహరి జయంతి సందర్భంగా ఈ సినిమాలోని మేఘాంశ్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ విడుదల చేశారు. దానిలో మేఘాంశ్, అతని వెనుక శ్రీహరి ఇద్దరూ పోతురాజు ఆహార్యంలో కనిపించారు.

భైరవకాళి ఫ్లిక్స్ బ్యానర్‌పై లెల్లా రాహుల్ నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే సగానికి పైగా పూర్తయినట్లు చిత్రబృందం వెల్లడించింది. త్వరలోనే టైటిల్ గ్లింప్స్ విడుదల చేస్తామని, దీని కోసం ప్రత్యేకంగా ఈవెంట్‌ నిర్వహిస్తామని తెలిపింది. టైటిల్‌ గ్లిమ్స్‌తో పాటు ఈ సినిమాలోని ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు వెల్లడించనున్నారు.


Related Post

సినిమా స‌మీక్ష