హను రాఘవపూడి దర్శకత్వంలో ప్రభాస్ ఇమాన్వీ జంటగా చేస్తున్న ‘ఫౌజీ’ అప్‌డేట్ వచ్చింది. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా శనివారం ఫౌజీ పోస్టర్ విడుదల చేశారు. దానిలో చార్మినార్ పరిసర ప్రాంతాలు మంటలలో తగులబడుతుంటే, రక్తమోడుతున్న దుస్తులలో రెండు చేతులలో తుపాకులు పట్టుకొని వస్తున్న ప్రభాస్, చార్మినార్ వైసీపీ వెళుతున్న మహాత్మాగాంధీజీలను పోస్టర్లో చూపారు.
ఇప్పటికే ఫౌజీ టాకీ పార్ట్ షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం యాక్షన్ సీన్స్ షూటింగ్ జరుగుతోంది. ఈ యాక్షన్ సన్నివేశాలలో వీలైనంత వరకు ప్రభాస్ డూప్, బాడీ డబుల్ లేకుండా స్వయంగా చేస్తున్నట్లు తెలుస్తోంది. డిసెంబర్ 3న ఫౌజీ విడుదల కాబోతోందని ఈ పోస్టర్లో రిలీజ్ డేట్ కూడా ప్రకటించడంతో అభిమానులు చాలా సంతోషంగా ఉన్నారు.
ఇది 1930-47 మద్య రెండో ప్రపంచ యుద్ధం నేపధ్యంలో బ్రిటిష్ వారిపై తిరుగుబాటు చేసిన ఓ సైనిక యోధుడు కధ. దీనికి ఫ్రీక్వెల్ కూడా ఉంటుందని దర్శకుడు హనీ రాఘవపూడి చెప్పారు. రెండు భాగాలలో ప్రభాస్ పాత్ర తీరు పూర్తిగా భిన్నంగా ఉంటుందని చెప్పారు.
ఫౌజీలో జయప్రద, మిథున్ చక్రవర్తి, అనుపం ఖేర్, భాను చందర్ తదితరులు ముఖ్యపాత్రలు చేస్తున్నారు.
ఈ సినిమాకు కధ దర్శకత్వం: హను రాఘవపూడి; సంగీతం:విశాల్ చంద్రశేఖ; కెమెరా: సందీప్ ఛటర్జీ; ఎడిటింగ్: కోటగిరి వెంకటేశ్వర రావు, విజువల్ ఎఫెక్ట్స్: ఆర్‌సి కమల కన్నన్ చేస్తున్నారు.
మైత్రీ మూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై నవీన్ ఎర్నేని, వైసీపీ రవిశంకర్, భూషణ్ కుమార్ కలిసి రూ.300 కోట్ల భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా మూవీగా ఫౌజీ నిర్మిస్తున్నారు. డిసెంబర్ 3న ఫౌజీ ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది.

Before freedom became a celebration, it was a battle!

Saluting the spirit of every Fauzi who fought for our tomorrow 🙏🏼

Happy Independence Day 🇮🇳

– Team #FAUZI#Fauzi GRAND RELEASE WORLDWIDE ON 3rd DECEMBER 2026 ❤️🔥#FauziOnDec3#Prabhas #Imanvi pic.twitter.com/Z7iNdaLo5t
— Fauji (@Faujitherebel) August 15, 2026