గోల్కొండ ఖిల్లాపై త్రివర్ణ పతాకం రెపరెపలు!

August 15, 2026


img

నేడు 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా సిఎం రేవంత్ రెడ్డి గోల్కొండ కోటలో జాతీయ జెండా ఆవిష్కరించారు. నేడు ఢిల్లీలోని ఎర్రకోట వద్ద, ఇక్కడ గోల్కొండ కోటలో జరిగిన ఈ వేడుకలలో తొలిసారిగా వందేమాతరం గీతాలాపన చేశారు. 

అనంతరం అక్కడ నుంచి రాష్ట్ర ప్రజలను ఉద్దేశ్యించి ప్రసంగిస్తూ, తమ ప్రభుత్వం చేపట్టి పూర్తిచేసిన పలు అభివృద్ధి పనులు, అమలుచేస్తున్న సంక్షేమ పధకాల గురించి వివరించారు. రాబోయే రెండున్నరేళ్ళలో చేయబోతున్న పలు అభివృద్ధి పనుల గురించి సిఎం రేవంత్ వివరించారు. విద్యా, వైద్యం, ఉద్యోగాల కల్పనా, మౌలిక వసతుల కల్పన     తమ ప్రభుత్వ ప్రాదాన్యతలని వివరిస్తూ వాటి కోసం ఏమేమి చేస్తున్నారో సిఎం రేవంత్ రెడ్డి వివరించారు. 

తెలంగాణ రైతులకు నష్టం కలిగించే ఏ పనులను తన ప్రభుత్వం అనుమతించబోదని సిఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. పేదల సొంతింటి కార్యకర్తలు నెరవేర్చేందుకు కోర్ అర్భన్ పరిధిలోనే ఏకంగా లక్ష ఇందిరమ్మ ఇళ్ళు నిర్మిస్తున్నామని చెప్పారు. 

రాష్ట్రంలో కొత్తగా 2.25 లక్షల మందికి నేటి నుంచే ఆసరా పెన్షన్లు అందిస్తున్నామని చెప్పారు. నేటి నుంచే తెల్ల రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం కూడా ప్రారంభిస్తున్నామని చెప్పారు. ఈ విద్యా సంవత్సరం నుంచే విద్యార్ధుల ఫీజ్ రీఇంబర్స్‌మెంట్ చెల్లిస్తామని దీని కోసం రూ.2,400 కోట్లు బ్యాంకులలో జమా చేయబోతున్నామని సిఎం రేవంత్ రెడ్డి చెప్పారు.


Related Post