ఎల్లమ్మ తొలి షెడ్యూల్ పూర్తి..

August 16, 2026


img

బలగం వేణు దర్శకత్వంలో రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ హీరోగా తెరకెక్కుతున్న ‘ఎల్లమ్మ’ సినిమా షూటింగ్ ఆలస్యంగా మొదలైనప్పటికీ, శరవేగంగా తొలి షెడ్యూల్ పూర్తి చేసుకుంది. ఈ షెడ్యూల్‌లో హీరో చిన్ననాటి ఎపిసోడ్‌కు సంబంధించిన సన్నివేశాలతో పాటు ఓ పాటను చిత్రీకరించారు. దేవిశ్రీ ప్రసాద్‌కు జోడీగా సురభి నటిస్తుండగా, ప్రకాశ్ రాజ్ ఓ ముఖ్యపాత్ర చేస్తున్నారు.

ఈ నెల 23 లేదా 24న దేవిశ్రీ ప్రసాద్, ప్రకాశ్ రాజ్‌లపై కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నట్లు సమాచారం. దీంతో తదుపరి షెడ్యూల్‌పై కూడా ఆసక్తి నెలకొంది.

ఈ సినిమాలో దేవిశ్రీ ప్రసాద్ హీరోగా నటించడంతో పాటు సంగీతం కూడా అందిస్తున్నారు. తెలంగాణ గ్రామీణ ప్రజల ఆరాధ్య దైవమైన ఎల్లమ్మ తల్లి జాతర నేపథ్యంలో తెలంగాణ గ్రామీణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించే విధంగా వేణు ఎల్దండి కథను అల్లుకున్నారు.

శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్న ఈ సినిమాను ఈ ఏడాది చివరిలోగా విడుదల చేయాలని చిత్రబృందం ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.






Related Post

సినిమా స‌మీక్ష