హైదరాబాద్‌ ఆటో డ్రైవర్లకు శుభవార్త

August 16, 2026


img

హైదరాబాద్‌ను కాలుష్యరహిత, పర్యావరణహిత నగరంగా మార్చేందుకు తెలంగాణ ప్రభుత్వం ముందుగా హైదరాబాద్‌లోని పెట్రోల్, డీజిల్ ఆటోలను దశలవారీగా ఎలక్ట్రిక్ ఆటోలుగా మార్చేందుకు ‘తెలంగాణ ఆటోరిక్షా ఎలక్ట్రిక్ కన్వర్షన్ స్కీమ్–2026’(కొత్త పధకం)కు ఆమోదం తెలిపింది. 

ఈ పథకం కోసం రూ.200 కోట్లు కేటాయించగా.. అర్హులైన ఆటో డ్రైవర్లకు ఈ మార్పిడి కొరకు గరిష్ఠంగా రూ.1.50 లక్షల వరకు ప్రభుత్వం సబ్సిడీ అందించనుంది.

ముందుగా హైదరాబాద్ కోర్ అర్బన్ రీజియన్‌లో నడుస్తున్న11,254 డీజిల్, 7,512 పెట్రోల్ ఆటోలు కలిపి మొత్తం 18,766 ఆటోలను దశలవారీగా ఎలక్ట్రిక్ వాహనాలుగా మార్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. 

పాత ఆటోలను ఎలక్ట్రిక్ వాహనాలుగా మార్చుకునేందుకు ప్రభుత్వం రెండు అవకాశాలు కల్పించనుంది. ఆమోదించిన ఎలక్ట్రిక్ కిట్‌ను అమర్చుకోవచ్చు. లేదా పాత ఆటోను స్క్రాప్ చేసి కొత్త ఎలక్ట్రిక్ ఆటో కొనుగోలు చేసుకోవచ్చు. వీటిలో ఏది ఎంచుకున్నా అర్హులైన వారికి గరిష్ఠంగా రూ.1.50 లక్షల వరకు సాయం అందుతుంది.

ఈ పథకాన్ని ఆన్‌లైన్ విధానంలో అమలు చేయనున్నారు. అర్హత, పత్రాల పరిశీలన, ఆర్టీఓ వెరిఫికేషన్ అనంతరం సబ్సిడీని నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్నారు. త్వరలోనే దీనికి సంబంధించి విధివిధానాలు ప్రకటించే అవకాశం ఉంది.


Related Post