ఈసారి ఖైరతాబాద్ కంటే ఎత్తుగా నాగోల్‌ గణపతి విగ్రహం

August 16, 2026
img

హైదరాబాద్‌లో వినాయక చవితి ఉత్సవాలంటే ముందుగా గుర్తొచ్చేది ఖైరతాబాద్ గణేశుడే. అయితే ఈసారి ఖైరతాబాద్ గణపతిని కంటే మరో మూడడుగులు ఎత్తుతో నాగోల్‌లో భారీ మట్టి గణపతి విగ్రహం సిద్దం చేస్తున్నారు. ఖైరతాబాద్‌లో 69 అడుగుల పంచముఖ సంకటహర మహాగణపతిని ఏర్పాటు చేస్తుండగా, నాగోల్‌లో 72 అడుగుల అష్టసిద్ధి మహాగణపతిని తయారు చేస్తున్నారు.

నాగోల్‌లోని తిరంగ్ యూత్ అసోసియేషన్ తయారు చేయిస్తున్న ఈ భారీ మట్టి విగ్రహంపై, ఏడు విభిన్న రూపాల్లో చిన్న గణేషుల ప్రతిమలను కూడా ఏర్పాటు చేస్తున్నారు.

గత నెల రోజులుగా 21 మందికి పైగా కార్మికులు ఈ అష్టసిద్ధి మహాగణపతి విగ్రహం తయారుచేస్తున్నారు. వినాయక చవితికి మూడు రోజుల ముందునుంచే భక్తులకు దర్శనం కల్పిస్తామని నిర్వాహకులు చెపుతున్నారు. 


Related Post