వివేక్ దండు, సంగీతన విపిన్ హీరోహీరోయిన్లుగా తెరకెక్కుతున్న చిత్రం ‘పనసపల్లి ఫ్యాన్స్ అసోసియేషన్’. ఈ సినిమాకు రవి కిషోర్ దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా విడుదలైన ఈ సినిమా మోషన్ పోస్టర్ చాలా బాగుంది. పనసపల్లి అనే ఊర్లో నందమూరి బాలకృష్ణ, మెగాస్టార్ చిరంజీవి అభిమానుల మద్య జరిగే గొడవల నేపధ్యంలో గ్రామీణ వాతావరణం, అక్కడి సినీ అభిమానుల తీరు చూపబోతున్నట్లు మోషన్ పోస్టర్ ద్వారా అర్ధమవుతుంది.
ఈ సినిమాలో సప్తగిరి, రాజా రవీందర్, బాబు మోహన్, వంశీధర్ గౌడ్, షైనింగ్ ఫణి, జబర్దస్త్ అశోక్, అప్పారావు తదితరులు ముఖ్య పాత్రలు చేస్తున్నారు.
సినిమాటోగ్రఫీ: మోహన్ చారి, సంగీతం: ఎం.ఎల్. రాజా, ఎడిటర్: నరేష్ అడుపా చేస్తున్నారు. క్యాండిడ్ ఫిల్మ్స్ బ్యానర్‌పై పి. వివేకానంద వర్మ ఈ సినిమా నిర్మిస్తున్నారు.