మాస్ మహారాజా రవితేజ హీరోగా శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఇరుముడి’ సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డు ఈ సినిమాకు U/A సర్టిఫికెట్ జారీ చేసింది. సినిమా రన్‌టైమ్ 2 గంటల 25 నిమిషాలుగా ఉంది.
‘ఇరుముడి’ని పక్కా ఫ్యామిలీ డ్రామాగా రూపొందించారు. పైగా హీరో అయ్యప్పమాల ధరించి దీక్ష తీసుకొని శబరిమల వెళ్ళినట్లు కూడా పాటలు,పోస్టర్లు, టీజర్, ట్రైలర్‌లో చూపిస్తున్నారు. ఇలాంటి నేపధ్యం ఉన్న ‘ఇరుముడి’కి క్లీన్ ‘యూ సర్టిఫికేట్’ లభిస్తుందనుకుంటే, సెన్సార్ బోర్డు యూ/ఏ సర్టిఫికేట్ జారీ చేయడం ఆలోచింపజేస్తుంది. బహుశః రవితేజ మార్క్ ఫైట్స్, రక్తపాతం కూడా ఉండే ఉంటుంది కనుకనే యూ/ఏ సర్టిఫికేట్ జారీ చేసి ఉండవచ్చు. ఏది ఏమైనప్పటికీ ఈ సర్టిఫికేట్ ‘ఇరుముడి’ సినిమాపై ఇంతవరకు ఏర్పడిన అభిప్రాయాలను ఒక్కసారిగా మార్చేస్తున్నట్లు అనిపిస్తుంది.
ఈ సినిమాలో తండ్రి, కూతుర్లుగా నటిస్తున్న రవితేజ, బేబీ నక్షత్ర మద్య సాగే భావోద్వేగ సన్నివేశాలు ఈ సినిమాకు ప్రధాన బలంగా నిలుస్తాయి.
ప్రియా భవానీ శంకర్ రవితేజ భార్యగా నటించగా, సాయికుమార్, అజయ్ ఘోష్, స్వాసిక తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందించారు.
మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రం ఆగస్టు 21న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.