దసరాకి అల్వాల్, క్రిస్మస్‌కి ఎల్బీ నగర్‌ టిమ్స్: సిఎం రేవంత్

August 18, 2026


img

సిఎం రేవంత్ రెడ్డి మంత్రులతో కలిసి సోమవారం సనత్ నగర్‌ టిమ్స్ హాస్పిటల్‌కు ప్రారంభోత్సవం చేశారు. దీనికి డా.మర్రి చెన్నారెడ్డి టిమ్స్ హాస్పిటల్‌ అని పేరు పెట్టారు. ఈ సందర్భంగా సిఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, “గత ప్రభుత్వం టిమ్స్ హాస్పిటల్స్‌కు కొబ్బరికాయలు కొట్టి చేతులు దులుపుకుంది. వాటిని మా ప్రభుత్వం నిర్మించి పూర్తిచేసి నేడు ప్రారంభోత్సవం చేస్తుంటే, కేటీఆర్‌ హడావుడిగా వచ్చి మేమే కట్టించామని చెప్పుకుంటున్నారు. మరైతే మీ ప్రభుత్వ హయంలోనే ఎందుకు ప్రారంభోత్సవం చేయలేదు?

కేటీఆర్‌కి అబద్దాలు చెప్పడం, మా ప్రభుత్వం దుష్ప్రచారం చేయడం దురలవాటుగా మారింది. ఏడాదిలో మీ ఫామ్‌హౌసులు కట్టుకోగాలిగారు. కానీ పేదల కోసం టిమ్స్ హాస్పిటల్స్ పూర్తి చేయడానికి మీకు మనసొప్పలేదు. కానీ మా ప్రభుత్వం వైద్యానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తోంది. కనుక అధికారంలోకి రాగానే టిమ్స్ హాస్పిటల్స్ నిర్మాణ పనులకు నిధులు కేటాయించి ఒకటొకటి పూర్తి చేస్తోంది. 

అల్వాల్, ఎల్బీ నగర్‌ టిమ్స్ హాస్పిటల్స్ నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. దసరాకు కూడా అల్వాల్, క్రిస్మస్‌కి ఎల్బీ నగర్‌ టిమ్స్ హాస్పిటల్స్ ప్రారంభిస్తాము. వరంగల్‌ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, ఉస్మానియా హాస్పిటల్ పనులు కూడా జోరుగా సాగుతున్నాయి. వాటిని కూడా 2027 లోగా పూర్తిచేసి ప్రారంభిస్తాము,” అని సిఎం రేవంత్ రెడ్డి చెప్పారు.       

<blockquote class="twitter-tweet"><p lang="te" dir="ltr">రాబోయే ఏడాదిన్నర కాలంలో ఉస్మానియా జనరల్ హాస్పిటల్, అల్వాల్ టిమ్స్‌, ఎల్‌బీనగర్ టిమ్స్, వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌లను వరుసగా ప్రతి ఆరు నెలలకు ఒక ఆసుపత్రి నిర్మాణం పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తెస్తామని ముఖ్యమంత్రి శ్రీ <a href="https://x.com/revanth_anumula?ref_src=twsrc%5Etfw">@revanth_anumula</a> గారు ప్రకటించారు. రాష్ట్రంలో ఏ… <a href="https://t.co/TaJweEAkcO">pic.twitter.com/TaJweEAkcO</a></p>&mdash; Telangana CMO (@TelanganaCMO) <a href="https://x.com/TelanganaCMO/status/2089395788225065036?ref_src=twsrc%5Etfw">August 17, 2026</a></blockquote> <script async src="https://platform.x.com/widgets.js" charset="utf-8"></script>

Related Post