అనుపమ బ్రేకప్ తర్వాత... ధృవ్‌పై బ్లాస్టింగ్

August 19, 2026


img

ప్రముఖ నటి అనుపమ పరమేశ్వరన్‌ ఇటీవల తన బాయ్ ఫ్రెండ్‌ ద్రువ్ విక్రంతో బ్రేకప్ అయినట్లు స్వయంగా చెప్పారు. రెండేళ్ళుగా ప్రేమించిన అతనితో పెళ్ళికి కూడా సిద్దపడ్డానని, కానీ అతను మానసికంగా పెట్టే టార్చర్ భరించలేక బ్రేకప్ అయ్యానని చెప్పారు. 

అతను ‘నార్సిసిస్టిక్ అబ్యూజ్‌’ (మానసికంగా ఒత్తిడి తెస్తూ ఎదుట వ్యక్తిని మానసికంగా బలహీనపరుస్తూ ఆధిపత్యం సాధించాలనుకోవడం) చేసే వాడని అనుపమ చెప్పారు. 

బ్రేకప్‌తో వారి లవ్ స్టోరీ ముగిసిపోయిందనుకుంటే, అనుపమ పరమేశ్వరన్‌ మళ్ళీ అతని గురించి మాట్లాడుతూ ఈ రెండేళ్ళలో తాను ఎంతగా నరకం అనుభవించేవారో చెప్పారు. తన పీరియడ్స్ (నెలసరి) గురించి కూడా అతను చాలా చులకనగా అసహ్యంగా మాట్లాడేవాడని, దాంతో ఓ మహిళగా పుట్టినందుకు తనపై తనకే అసహ్యం కలిగేలా చేశాడని అన్నారు. ఈ కారణంగా సొంత తమ్ముడుతో కూడా చనువుగా మాట్లాడాలంటే భయపడేదానినని చెప్పారు. షూటింగ్‌ సమయంలో అతను ఫోన్ చేసిన ప్రతీసారి కార్వాన్‌లో తలుపులు మూసుకు ఏడ్చేదానినని అనుపమ పరమేశ్వరన్‌ చెప్పారు. 

అయితే ధృవ్ విక్రం మాత్రం హుందాగానే స్పందించడం విశేషం. “ఆమెతో బ్రేకప్ తర్వాత నా జీవితంలో అత్యంత కష్టకాలం అనుభవించాను. కానీ నా తల్లితండ్రులు, స్నేహితులు, అభిమానుల అందదండలతో మళ్ళీ నేను కోలుకొని పనిపై దృష్టి పెట్టాను.

సినీ పరిశ్రమలో ఉన్నప్పుడు ఇలాంటి విమర్శలు, ఆరోపణలు చాలా కామన్. కానీ ఇలాంటి సమయంలోనే మనల్ని మనం అర్థం చేసుకోవడం, పరిస్థితులను ధైర్యంగా ఎదుర్కొని ముందుకు సాగడం ముఖ్యమని భావిస్తున్నాను. మనలో నిజాయితీ, మన ప్రవర్తన సరిగా ఉన్నప్పుడు ఎలాంటి విమర్శలు మనల్ని ఏమీ చేయలేవు,” అని అన్నారు. 


Related Post