టాలీవుడ్‌ పెద్దలకి తెలంగాణ ప్రభుత్వం షాక్!

August 19, 2026


img

తెలుగు సినీ పరిశ్రమలో భారీ బడ్జెట్‌ సినిమాలు తీస్తున్న ప్రముఖులకి తెలంగాణ ప్రభుత్వం షాక్ ఇచ్చింది. భారీ బడ్జెట్‌ సినిమాలు విడుదలైనప్పుడు, మొదట పది రోజులు టికెట్ చార్జీలు పెంచుకునేందుకు, ఒక రోజు ముందుగా ప్రీమియర్ షోలు, మర్నాటి నుంచి అదనపు షోలు వేసుకునేందుకు ప్రభుత్వాన్ని అనుమతి కోరుతుంటారు.

ఇకపై అలాంటి సినిమాలకు మొదటి పది రోజులలో వచ్చిన అదనపు రాబడిలో 20 శాతం తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్‌ కార్పోరేషన్, తెలంగాణ ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయిస్ కార్పోరేషన్ ఖాతాలలో జమా చేయాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సొమ్ముని సినీ పరిశ్రమలో కార్మికుల సంక్షేమం కోసం వినియోగిస్తామని ఉత్తర్వులలో పేర్కొంది. 

ఇప్పటికే విడుదలైన అఖండ-2, ది రాజాసాబ్, మన శంకర వరలక్ష్మి శరత్ కుమార్‌ ప్రసాద్ గారు, పెద్ది సినిమాలు టికెట్ ఛార్జీలు పెంచుకునేందుకు ప్రభుత్వం అనుమతించింది కనుక వాటి అదనపు రాబడిలో 20 శాతం లెక్కగట్టి జమా చేయాలని ఆదేశించింది. ఇది బడా నిర్మాతలకు పెద్ద షాక్ అనే చెప్పాలి. ముఖ్యంగా భారీ బడ్జెట్‌తో నిర్మించి బోర్లా పడిన సినీ నిర్మాతలకు ఈ ఉత్తర్వులు ఇంకా పెద్ద షాక్ అనే చెప్పాలి.


Related Post

సినిమా స‌మీక్ష