అట్లీ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చేస్తున్న సైన్స్ ఫిక్షన్ మూవీ ‘రాకా’ షూటింగ్ శరవేగంగా సాగుతుండగా, దీని గురించి ఎవరూ ఊహించని ఆసక్తికరమైన విషయాలు బయటకొస్తున్నాయి.
భారీ బడ్జెట్‌తో హాలీవుడ్ స్థాయిలో నిర్మిస్తున్న ఈ సినిమాలో హాలీవుడ్ నటుడు విల్ స్మిత్ ఓ ముఖ్యపాత్రలో నటించబోతున్నట్లు తెలుస్తోంది. అయితే అధికారికంగా ఇంకా ప్రకటించాల్సి ఉంది.
ఇప్పటికే పలువురు హాలీవుడ్ సాంకేతిక నిపుణులు తెలుగు సినిమాలకు పని చేస్తున్నారు. కనుక విల్ స్మిత్ ‘రాకా’లో నటించే అవకాశం ఉందనే భావించవచ్చు.
‘రాకా’లో అల్లు అర్జున్‌కి జోడీగా రష్మిక మందన, దీపికా పడుకొణే, జాన్వీ కపూర్, మృణాల్ ఠాకూర్ నలుగురు హీరోయిన్లు నటిస్తున్నారు.
అయితే మనిషి, మృగం కలిసిన పాత్ర చేస్తున్న అల్లు అర్జున్‌కి నలుగురు హీరోయిన్లు దేనికి? అనే ప్రశ్నకు సోషల్ మీడియాలో మరో అనూహ్యమైన సమాధానం వినిపిస్తోంది.
ఈ సినిమాలో అల్లు అర్జున్ తాత, తండ్రి, ఇద్దరు కొడుకుల పాత్రలు చేయబోతునందునే అని తెలుస్తోంది. దీని కోసం అల్లు అర్జున్‌కి లుక్ టెస్ట్ చేయగా చాలా బాగుండటంతో నాలుగు పాత్రలకి ఆయననే ఖరారు చేసినట్లు తెలుస్తోంది.
ఒకవేళ నాలుగు పాత్రలు చేస్తున్నట్లయితే నలుగురు హీరోయిన్ల వార్త కూడా నిజమే కావచ్చు. రాకాలో సీనియర్ నటి రమ్యకృష్ణ, బాలీవుడ్ సీనియర్ నటుడు షారూక్ ఖాన్ ముఖ్యపాత్రలు చేస్తున్నారు.
ఈ ఏడాది డిసెంబర్‌లోగా షూటింగ్ పూర్తి చేసి 2027 వేసవిలో రాకా విడుదల చేసేందుకు ప్లాన్ చేసుకున్నారు.
సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ సుమారు రూ.1,000 కోట్ల భారీ బడ్జెట్‌తో 9 భారతీయ భాషల్లో రాకా నిర్మిస్తున్నారు.