‘సంక్రాంతికి వస్తున్నాం’ అంటూ ముందే చెప్పి గత ఏడాది సంక్రాంతికి వచ్చి హిట్ కొట్టారు అనిల్ రావిపూడి-వెంకటేష్. ఈసారి కూడా మళ్ళీ పండగకి వస్తున్నామని చెప్పి మరీ వస్తున్నారు.
అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్, కళ్యాణ్ రామ్ హీరోలుగా చేస్తున్న సినిమా టైటిల్ వెరైటీగా ‘జనవరి 12 విడుదల’ అని ఖరారు చేశారు. దీనికి 'బావబామర్ది సౌజన్యంతో' అని పెట్టిన సబ్ టైటిల్ కూడా అందరినీ నవ్విస్తుంది.
ఈ సినిమాలో వెంకటేష్‌కి జోడీగా కీర్తి సురేష్, కళ్యాణ్ రామ్‌కి జోడీగా క్రుతిశెట్టి నటిస్తున్నారు. కనుక వాళ్ళు నలుగురూ కలిసి అనిల్ రావిపూడిని ఈ సినిమా టైటిల్ ఏమిటిని అదుగుతుంటే ఆయన పదేపదే ‘జనవరి 12 విడుదల’ అని సమాధానం చెపుతుంటాడు. సినిమా అతిల్ ప్రకటన కోసం ఈవిధంగా చిన్న కామెడీ స్కిట్ చేసి ప్రకటించడం చాలా ఆకట్టుకుంటోంది. ఈ సినిమా పేరులోనే ఎప్పుడు రిలీజ్ అవుతుందో కూడా చెప్పేశారు.
అనేక పెద్ద సినిమాలు రిలీజ్ కావాల్సిన సమయానికి వాయిదా పడుతుంటే, అనిల్ రావిపూడి సినిమా పూజా కార్యక్రమం రోజునే రిలీజ్ డేట్ ప్రకటించేసి, ఇలా ఆడుతూ పాడుతూ హాయిగా షూటింగ్ పూర్తిచేసి చెప్పిన టైమ్‌కి సినిమాలు విడుదల చేస్తున్నారు. ఇందుకు అనిల్ రావిపూడిని అభినందించాల్సిందే.
సురేష్ ప్రొడక్షన్స్, షైన్ స్క్రీన్, షైన్ స్క్రీన్, జీ స్టూడియోస్ బ్యానర్లపై సాహు గారపాటి నిర్మిస్తున్న ఈ సినిమాకి జీవి. ప్రకాష్ కుమార్ సంగీత దర్శకుడు.