అక్కినేని కుటుంబంలో నాగార్జున తర్వాత సీనియర్ నటుడు సుమంత్. కానీ చాలా కాలంగా ఇండస్ట్రీలో ఉన్నప్పటికీ మిగిలిన హీరోలా వరుసపెట్టి సినిమాలు చేయడం అలవాటు లేదు. కనుక మద్యలో గ్యాప్ వస్తుంటుంది. అలాంటి గ్యాప్ తర్వాత సంతోష్ జగర్లపూడి దర్శకత్వంలో ‘మహేంద్రగిరి వారాహి’ అనే సినిమాతో సెప్టెంబర్ 11న ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఈ సినిమా టీజర్‌ను నేడు విడుదలైంది.
టీజర్ చూస్తుంటే సరికొత్త కథాంశంతో సినిమాను రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. సుమంత్ పాత్ర, కథలోని కీలక అంశాలపై ఆసక్తిని పెంచేలా టీజర్‌ను కట్ చేశారు.
‘వారాహి’లో సుమంత్‌కు జోడీగా మీనాక్షి గోస్వామి నటిస్తున్నారు. ఐశ్వర్య రాజేష్, మాళవికా నాయర్, మంజు భార్గవి, బ్రహ్మానందం, రాజీవ్ కనకాల, వెన్నెల కిషోర్, వంశీ చాగంటి, కమల్ కామరాజు, శ్రీనివాస్ వడ్లమాని తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
ఈ సినిమాకు సంగీతం: అనూప్ రూబెన్స్; సినిమాటోగ్రఫీ: ప్రతాప్ ఆర్. కృష్ణ; ఎడిటింగ్: , జునైద్ సిద్ధిఖీ చేస్తున్నారు. రాజశ్యామల ఎంటర్‌టైన్‌మెంట్స్, బ్రిడ్జ్ ఫిల్మ్స్ బ్యానర్లపై మధు కలిపు, లక్ష్మణ్ కలిసి ఈ సినిమా నిర్మిస్తున్నారు. సెప్టెంబర్ 11న ‘వారాహి’ 5 భాషల్లో విడుదల కాబోతోంది.