సంగీత్ శోభన్.. ఒకేరోజు రెండు కొత్త సినిమాల ప్రకటన

August 20, 2026


img

యువ హీరో సంగీత్ శోభన్ పుట్టిన రోజు సందర్భంగా నిన్న కొత్త సినిమా ప్రకటన చేశారు. ప్రణయ్‌ రావు దర్శకత్వంలో తెరకెక్కబోతున్న ఈ సినిమాని అర్చన ఆచంట సమర్పణలో  షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి నిర్మిస్తున్నారు. షైన్ స్క్రీన్స్ సంస్థకు ఇది 15వ సినిమా కాగా, సంగీత్ శోభన్‌కి ఇది 5వ సినిమా. త్వరలోనే షూటింగ్‌ ప్రారంభించబోతున్నట్లు ప్రకటించారు.

సంగీత్ శోభన్ పుట్టిన రోజు సందర్భంగా మరో సినిమా ప్రకటన కూడా వచ్చింది. పల్నాటి సూర్యప్రతాప్ దర్శకత్వంలో చేయబోతున్న ఈ సినిమాని ధీరజ్ మొగిలినేని ఎంటర్‌టైన్మెంట్స్‌ వీబిజీ ఎంటర్‌టైన్మెంట్స్‌ బ్యానర్లపై ధీరజ్ మొగిలినేని, గిరిబాబు వల్లభనేని కలిసి నిర్మిస్తున్నారు. ఈ నెల 23న ఈ సినిమా టైటిల్‌ గ్లిమ్స్‌ విడుదల చేస్తామని తెలియజేస్తూ ఓ చక్కటి పోస్టర్ కూడా వేశారు.


Related Post

సినిమా స‌మీక్ష