ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఎపిక్ ఫస్ట్ సెమిస్టర్’. ఆదిత్య హాసన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా నుంచి ‘మనసా వాచా... అంటూ సాగే లిరికల్ వీడియో సాంగ్ నేడు విడుదలైంది. ప్రేమ, యూత్‌ఫుల్ ఎమోషన్స్‌తో సాగుతున్న ఈ పాట ఆకట్టుకునేలా ఉంది.
శ్రీహర్ష ఈమని వ్రాసిన ఈ పాటకు హేషమ్ అబ్దుల్ వహాబ్ సంగీతం అందించగా ఎస్పీ చరణ్, కె.ఎస్. చిత్ర మృదుమధురంగా ఆలపించారు.
సూపర్ హిట్ సినిమా ‘బేబీ’ తర్వాత ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య కలిసి చేస్తున్న సినిమా కావడంతో, ‘ఎపిక్ ఫస్ట్ సెమిస్టర్’పై భారీగా అంచనాలు నెలకొన్నాయి.
ఈ సినిమాకు సంగీతం: హేషమ్ అబ్దుల్ వహాబ్; సినిమాటోగ్రఫీ: అజీమ్ మొహమ్మద్; ఆర్ట్: ధీరజ్ పొనుగోటి, ప్రకీర్తి ఉప్పలపాటి;ఎడిటింగ్: నవీన్ నూలి, చేస్తున్నారు.
సితారా ఎంటర్‌టైన్మెంట్స్, శ్రీకర్ స్టూడియోస్, ఫార్చ్యూన్ సినిమాస్ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు.