రేవంత్ రెడ్డి ప్రభుత్వం రాష్ట్రంలోని ప్రైవేట్ భూములపై కన్నేసి రెవెన్యూ చట్టంలోని 22ఏని దుర్వినియోగం చేస్తోందని బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే హరీష్ రావు ఆరోపిస్తున్నారు. ఇందుకు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని బాద్యుడిని చేస్తూ పదవిలో నుంచి తప్పించాలని కోరుతూ రాహుల్ గాంధీకి లేఖ కూడా వ్రాశారు.
దీనిపై తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయం సోషల్ మీడియా ద్వారా ప్రజలకు ఓ విజ్ఞప్తి చేసింది. 22ఏపై అనుమానాలు, అపోహలొద్దని దీని గురించి బ్రోకర్లు, కొందరు రాజకీయ నాయకులు చేస్తున్న దుష్ప్రచారాన్ని నమ్మవద్దని విజ్ఞప్తి చేసింది.
ప్రైవేట్ భూముల పరిరక్షణకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఈ విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని స్పష్టం చేసింది. ఒకవేళ భూముల రిజిస్ట్రేషన్ సమయంలో అవి 22ఏ కింద ఉన్నాయని అనుమానం కలిగితే, వెంటనే దర్యాప్తు జరిపి రెండు రోజులలోనే నివేదిక ఇస్తారని పేర్కొంది. ఒకవేళ అవి 22ఏ కింద రానట్లయితే వెంటనే రిజిస్ట్రేషన్ చేస్తారని సిఎంవో పేర్కొంది.
22-ఏ నిషేధిత భూముల రిజిస్ట్రేషన్ల అంశంపై ముఖ్యమంత్రి శ్రీ @revanth_anumula గారు రెవెన్యూ శాఖ మంత్రి @INC_Ponguleti గారు ఇతర ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రజల ఆస్తి హక్కుల పరిరక్షణకు తమ ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని స్పష్టం చేశారు. ఆస్తులు కలిగిన వారు రిజిస్ట్రేషన్… pic.twitter.com/kbz9OTrfq8
— Telangana CMO (@TelanganaCMO) August 18, 2026