జనసేన ఎంపీ కొడుకుపై హైదరాబాద్‌లో కేసు నమోదు

August 21, 2026
img

ఏపీలో జనసేన ఎంపీ లింగమనేని రమేష్ కొడుకు సంజూష్‌పై హైదరాబాద్‌లో పోలీస్ కేసు నమోదయింది. ఈ నెల 16న ఇనార్బిట్ మాల్ వద్ద జరిగిన ప్రమాదంలో ఆ సంస్థలో పనిచేస్తున్న భారతి ముఖి (26) అనే ఉద్యోగిని మరణించింది. ఆ రోజు మధ్యాహ్నం 3గంటలకు ఆమె తన సహోద్యోగినితో కలిసి రోడ్ దాటుతుండగా, సంజూష్‌ డ్రైవ్‌ చేస్తున్న కారు వేగంగా ఢీ కొట్టింది. ఆ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఆమె జూబ్లీహిల్స్ అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయింది. 

ఈ ఘటనలో మాదాపూర్ పోలీసులు లింగమనేని సంజూష్‌పై నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేసి ఓ మహిళ మృతికి కారణమైనందుకు సెక్షన్స్ 106(1) కింద కేసు నమోదు చేశారు.

Related Post