జనవరి 7న కొక్కొరోకో... తెలుగు, తమిళ్ భాషల్లో

August 22, 2026


img

శ్రీనివాస్ వసంతాల దర్శకత్వంలో తెలుగు, తమిళ్ భాషల్లో రూపొందుతున్న సినిమా కొక్కొరోకో. ప్రముఖ దర్శకుడు రమేష్ వర్మ నిర్మాతగా మారి ఆర్‌వీ ఫిలిమ్స్ సొంత బ్యానర్‌పై ఈ సినిమా నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో సముద్రఖని ప్రధానపాత్ర చేస్తున్నారు. రాఘవ లారెన్స్, పూజా హెగ్డే, నోరా ఫతే, మీరాజ్ రాజ్ తదితరులు ముఖ్యపాత్రలు చేస్తున్నారు. 

ఈ సినిమాకి కధ, స్క్రీన్ ప్లే: రమేష్ వర్మ, డైలాగ్స్: జీవీ సాగర్, సంగీతం: కృష్ణ ప్రసాద్, కెమెరా: ఆకాష్ ఆర్‌ జోషి, ఎడిటింగ్: ప్రవీణ్ పూడి, స్టంట్స్: వెంకట్ నేడూరి చేశారు. 

ఆర్‌వి స్టూడియోస్, శ్రీ నీలాద్రి ప్రొడక్షన్స్ బ్యానర్లపై రమేష్ వర్మ, రేఖ వర్మ, కూరపాటి శిరీష కలిసి ఈ సినిమా నిర్మిస్తున్నారు. నేడు రమేష్ వర్మ పుట్టిన రోజు సందర్భంగా ‘కొక్కొరోకో’ పోస్టర్ విడుదల చేశారు. వచ్చే ఏడాది సంక్రాంతి పండుగకు ముందు జనవరి 7న ‘కొక్కొరోకో’ విడుదల చేయబోతున్నట్లు తెలిపారు.


Related Post

సినిమా స‌మీక్ష