రేవంత్ రాక కోసం కాంగ్రెస్ నేతల ఎదురుచూపులు!

August 22, 2026


img

తెలంగాణ కాంగ్రెస్‌లో ఇప్పుడు అందరూ సిఎం రేవంత్‌రెడ్డి రాక కోసం ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం లండన్ పర్యటనలో ఉన్న సీఎం ఆదివారం హైదరాబాద్‌కు తిరిగి రానున్నారు.

ఆయన విదేశీ పర్యటనలో ఉన్నప్పుడు మంత్రి కొండా సురేఖ కుమార్తె కొండా సుస్మిత అయనపై తీవ్రమైన ఆరోపణలు చేశారు. అసలు రేవంత్ రెడ్డి ఎవరు? సిఎం అయిన తర్వాత రేవంత్‌ రెడ్డికి అహంకారం బాగా పెరిగిపోయింది. ఇలాగే వ్యవహరిస్తే ఢిల్లీ నుంచి సీల్డ్ కవరులో మరో సిఎం పేరు వస్తుంది జాగ్రత్త! రేవంత్ సోదరుల భూభాగోతాలు త్వరలోనే బయటపెడతానంటూ సుస్మిత చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్‌ పార్టీలో పెద్ద దుమారమే రేపాయి.  

ఇందుకు కాంగ్రెస్‌ పార్టీ కొండా సురేఖకు షోకాజ్ నోటీస్ ఇవ్వగా, సుస్మిత వ్యాఖ్యలతో తనకు సంబంధం లేదని సింపుల్‌గా తేల్చేశారు. సిఎం రేవంత్‌ రెడ్డిపై కూతురు అంత తీవ్రమైన ఆరోపణలు చేస్తే ఆమె కనీసం వాటిని ఖండించకపోవడాన్ని కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు తప్పు పడుతూ, తక్షణం ఆమెను మంత్రివర్గంలో నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు.

కనుక సిఎం రేవంత్‌ రెడ్డి తిరిగి వచ్చిన తర్వాత ఈ వివాదంపై ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది కాంగ్రెస్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.


Related Post