చిరంజీవి ‘కాకా’.. టైటిల్ గ్లింప్స్

August 22, 2026


img

నేడు మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా బాబి కొల్లి దర్శకత్వంలో చేస్తున్న సినిమా టైటిల్ గ్లింప్స్ విడుదల చేశారు. ఈ సినిమాకి ‘కాక’ అనే టైటిల్‌ ఖరారు చేశారు. 

టైటిల్‌ గ్లింప్స్‌లో చిరంజీవి ఆక్వా పరిశ్రమలో పనిచేసే సూపర్‌వైజర్‌ సత్యంగా చూపారు. కానీ తర్వాత చిరంజీవిని మాస్‌ స్టైల్లో పరిచయం చేశారు. 

రొయ్యల ట్యాంకులో పడిపోయిన స్కూటర్‌ తాళాలను ఓ భారీ అయస్కాంతంతో బయటకు తీసినప్పుడు, దానితో పాటు తుపాకులు బయటకు వస్తాయి. కనుక ఆక్వా వ్యాపారం పేరుతో ఆయుధాలు స్మగ్లింగ్ చేసే డీలర్‌ అన్నట్లు చిరంజీవిని చూపారు. ఈ ట్విస్ట్ సినిమాపై ఆసక్తి పెంచుతుంది. 

చిరంజీవి సూపర్ హిట్ సినిమా ‘గ్యాంగ్ లీడర్’ పాట రీమిక్స్ దీనిలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇది కూడా చిరంజీవి మార్క్  మాస్, యాక్షన్, ఎంటర్‌టైనర్‌ అని ‘కాక’ టైటిల్‌ గ్లిమ్స్‌తో స్పష్టం చేశారు. 

ఈ సినిమాలో అనస్వర రాజన్, నివేదా పేతురాజ్, సునీల్, గెటప్ శ్రీను కీలక పాత్రల్లో నటిస్తున్నారు. 

ఈ సినిమాకు స్క్రీన్‌ప్లే: కోన వెంకట్, కే. చక్రవర్తి రెడ్డి, సంగీతం: తమన్, సినిమాటోగ్రఫీ: విజయ్ కార్తీక్ కన్నన్, ఎడిటింగ్: ఆంటోనీ రూబెన్ చేస్తున్నారు. డైలాగ్స్: భాను-నందు, యాక్షన్ కొరియోగ్రఫీ: రామ్-లక్ష్మణ్, నబాకాంత్,  ప్రొడక్షన్ డిజైన్: అవినాష్ కొల్లా, వీఎఫ్‌ఎక్స్‌: యుగంధర్ చేస్తున్నారు. 

కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై వెంకట్ కే. నారాయణ నిర్మిస్తున్న ‘కాక’ 2027 సంక్రాంతి కానుకగా జనవరి 13న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి కాబోతోంది. 


Related Post

సినిమా స‌మీక్ష