కేపీహెచ్‌బీలో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిని మృతి

August 22, 2026
img

ఉన్నత చదువులు పూర్తిచేసి, సాఫ్ట్‌వేర్ ఉద్యోగంలో స్థిరపడి కుటుంబానికి అండగా నిలవాలనుకున్న ఒక యువతి జీవితం అర్ధాంతరంగా ముగిసింది. 

హైదరాబాద్‌లోని కేపీహెచ్‌బీ పరిధిలో ఓ ప్రైవేట్ లేడీస్ హాస్టల్‌లో ఉంటున్న సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ యామిని (24) అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. 

పోలీసులు తెలిపిన సమాచారం ప్రకారం.. యామిని ఏపీలోని పల్నాడు జిల్లా నుంచి హైదరాబాద్‌ వచ్చి కేపీహెచ్‌బీలోని ఒక హాస్టల్‌లో ఉంటూ ఐటీ ఉద్యోగం చేస్తోంది.

గురువారం సాయంత్రం యామిని తన గదిలో అనుమానాస్పద స్థితిలో మరణించింది. సమాచారం అందుకున్న కేపీహెచ్‌బీ పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించి యామిని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. 

కూతురు సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తూ జీవితంలో ఉన్నత స్థాయికి ఎదుగుతుందని ఆశపడ్డ తల్లిదండ్రులు, ఈ వార్త వినడంతో కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. 

యామిని తండ్రి కుటుంబ పోషణ కోసం హైదరాబాద్‌లోనే డ్రైవర్‌గా పనిచేస్తున్నారు. యామిని మృతికి గల ఖచ్చితమైన కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు మొదలుపెట్టారు. 

Related Post