2030కి భారత్ సొంత స్పేస్ స్టేషన్: శుభాంశు శుక్లా

August 23, 2026
img

భారత్ అంతరిక్ష రంగంలో మరో కీలక అడుగు వేయబోతోంది. 2030 నాటికి అంతరిక్షంలో భారత్ సొంత స్పేస్ స్టేషన్‌ ఏర్పాటు చేసుకునేందుకు ఇస్రో సన్నాహాలు చేస్తోందని భారత వాయుసేన గ్రూప్ కెప్టెన్, ఇటీవల అంతరిక్ష యాత్ర చేసి వచ్చిన వ్యోమగామి శుభాంశు శుక్లా వెల్లడించారు. 

ఆయన ఐఐటి తిరుపతి 8వ స్నాతకోత్సవ సభకు ముఖ్య అతిధిగా హాజరైనప్పుడు ఈ విషయం వెల్లడించారు. అంతరిక్ష రంగంలో ఇస్రో ఇప్పటికే చాలా విజయాలు సాధించి, ప్రపంచ దేశాలలో దేశ ప్రతిష్టని ఇనుమడింపజేసిందన్నారు. అయితే భవిష్యత్‌ లక్ష్యాలు సాధనలో యువ ఇంజనీర్లు, వారి నూతన ఆవిష్కరణలు చాలా కీలకంగా నిలుస్తాయన్నారు. కనుక విద్యార్ధులు తమ కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చి, శాస్త్ర సాంకేతిక రంగాలలో దేశ భవిష్యత్‌ అవసరాలను తీర్చేందుకు మేదస్సుకి పదును పెట్టాలన్నారు. దేశ భవిష్యత్‌ కోసం యువత మరింత కష్టపడి పనిచేయడం అలవరచుకోవాలని శుభాంశు శుక్లా అన్నారు.    

ఇంతకాలం అమెరికా, రష్యా, చైనా స్పేస్ స్టేషన్ల గురించి విన్నాము. కానీ తొలిసారిగా అంతరిక్షంలో భారతదేశానికి సొంతంగా స్పేస్ స్టేషన్ ఏర్పాటు చేసుకునేందుకు సన్నాహాలు జరుగుతుండటం చాలా సంతోషకరమైన విషయమే. అయితే శుభాంశు శుక్లా చెప్పినట్లు యువత తమ కంఫర్ట్ జోన్‌లో నుంచి బయటకు వచ్చి మరింత కష్టపడటం చాలా అవసరం.   


Related Post