కొండా సుస్మిత సిఎం రేవంత్ రెడ్డిపై ఆరోపణలు చేసి పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘించినందుకు, కొండా సురేఖని మంత్రి పదవిలో నుంచి తప్పించాలంటూ పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ప్రెస్‌మీట్‌లు పెట్టి డిమాండ్ చేస్తున్నారు. వారందరూ బీసీ మహిళా మంత్రినైన తనపై మూకుమ్మడిగా దాడి చేస్తుంటే, కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ మౌనంగా ఉండటం భావ్యం కాదంటూ కమిటీ చైర్మన్ మల్లు రవికి మంత్రి కొండా సురేఖ లేఖ వ్రాశారు. ఆవిధంగా వారు ఎందుకు మాట్లాడుతున్నారో, వారిని వెనుక నుంచి ఎవరెవరు ప్రోత్సహిస్తున్నారో గుర్తించి వారిపై చర్యలు తీసుకోవాలని ఆమె విజ్ఞప్తి చేశారు. మంత్రిగా ఉన్న తనపై ఈవిదంగా మూకుమ్మడి దాడులు చేస్తుండటం కూడా పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘనే కదా? కానీ మౌనంగా ఎందుకున్నారని ప్రశ్నించారు.
మంత్రి కొండా సురేఖ లేఖలో ఏమి వ్రాశారో ఆమె మాటల్లోనే....