యూత్‌ను టార్గెట్ చేస్తూ సరికొత్త కాన్సెప్ట్‌తో తెరకెక్కుతున్న సినిమా ‘డెలులు’. ప్రస్తుతం యువతలో ట్రెండ్ అవుతున్న ఓ పాపులర్ పదాన్ని టైటిల్‌గా పెట్టుకున్న ఈ సినిమా నుంచి తాజాగా టీజర్ విడుదలైంది.
నిమిషం 32 సెకన్ల నిడివితో ఉన్న టీజర్ ‘బ్రేకప్ దేవా’ అనే డైలాగ్‌తో మొదలవుతుంది. ఆ తర్వాత టీజర్‌లో ‘నువ్వేమైనా ఫాదర్ ఆఫ్ ఇండియానా?’ వంటి డైలాగులు నవ్వులు పూయిస్తాయి.
ప్రీతం కస్తూరి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో విజయ్ రాజ్‌కుమార్, వేణి రావు, అఖిల్ జాక్సన్, సాయి ప్రసన్న, శ్రీ రామ మండవ, అభినయ్ తుల తదితరులు ముఖ్యపాత్రలు నటిస్తున్నారు.
ఈ సినిమాకు స్క్రీన్‌ప్లే, డైలాగ్స్: రెష్మిత్ ఎస్.కౌశిక, పాటలు: సుభాష్ సాకే, సంగీతం: ఆది చెబ్రోలు, సినిమాటోగ్రఫీ: జై రాజ్ నాయుడు, ఎడిటింగ్: హరికృష్ణ కురపాటి అందిస్తున్నారు.
క్రియేటివ్ లాంచ్‌ప్యాడ్ బ్యానర్‌పై సంకీర్త్ కొండ నిర్మిస్తున్న ‘డెలులు’ త్వరలో థియేటర్లలో విడుదల కాబోతోంది.