రణబాలి రిలీజ్‌ డేట్ వచ్చేసింది

August 27, 2026


img

విజయ్ దేవరకొండ, రష్మిక మందన పెళ్ళి తర్వాత జంటగా చేస్తున్న సినిమా ‘రణబాలి.’ రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న ‘రణబాలి’ షూటింగ్‌ దాదాపు పూర్తవడంతో అక్టోబర్ 16న ‘రణబాలి’ విడుదల చేయబోతున్నట్లు మైత్రీ మూవీ మేకర్స్ ప్రకటించింది. 

1854-78 మద్య బ్రిటిష్ కాలంలో రాయలసీమలో జరిగిన యదార్ధ ఘటనల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కిస్తున్నారు. రణబాలిలో దక్షిణాఫ్రిక నటుడు ఆర్నాల్డ్ వస్లూ బ్రిటిష్ అధికారిగా నటిస్తున్నారు.  

ఈ సినిమాకు కథ: ప్రమోద్ తమ్మినేని, సంగీతం: అజయ్-అతుల్, కెమెరా: నీరవ్ షా, ఎడిటింగ్: కార్తిక శ్రీనివాస్‌, ఆర్ట్: వితల్ కొసనం, స్టంట్స్: యానిక్ బెన్, అండీ లాంగ్ గుయెన్, రాబిన్ సుబ్బు చేస్తున్నారు.  

గుల్షన్ కుమార్‌, భూషణ్ కుమార్‌ సమర్పణలో మైత్రీ మూవీ మేకర్స్, టీ సిరీస్ బ్యానర్లపై నవీన్ ఎర్నేని, రవి శంకర్ కలిసి 5 భాషల్లో రణబాలి నిర్మిస్తున్నారు. 


Related Post

సినిమా స‌మీక్ష