శుక్రవారం దేశవ్యాప్తంగా రాఖీ పండుగ ఘనంగా జరుపుకోబోతున్నారు. అయితే ఇలాంటి సమయంలో తన అన్న కేటీఆర్ తనకు హ్యాండిచ్చి విదేశాలకు వెళ్ళిపోయారని టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆవేదన వ్యక్తం చేశారు.
ఆమె తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ, “గత ఏడాది రాఖీ పండుగ సమయంలో కేటీఆర్ హైదరాబాద్‌లో లేకుండా వెళ్లిపోయారు. ఈసారి ఏకంగా దేశంలోనే లేకుండా వెళ్లిపోయారు. రాఖీ పండుగకు రాజకీయాలతో ఏం సంబంధం?
ఒక ఆడబిడ్డగా నాకూ ఆత్మగౌరవం ఉంటుంది. దానిని చంపుకొని ఇంకా ఎన్నిసార్లు నేను అన్నని ప్రాదేయపడాలి? కేటీఆర్ వ్యవహరించిన తీరు నాకు చాలా బాధ కలిగిస్తోంది,” అని కల్వకుంట్ల కవిత అన్నారు.
అయితే ఆమె నిత్యం తండ్రిని, అన్నని, బీఆర్ఎస్ పార్టీని విమర్శిస్తూ అనుబంధాల గురించి మాట్లాడితే చాలా హాస్యాస్పదంగా ఉంటుంది కదా? వారిని ఆమె గౌరవించనప్పుడు, వారు మాత్రం ఆమెను ఎందుకు గౌరవిస్తారు?
కేటీఆర్ గారికి రాఖీ కడదాం అంటే గత సంవత్సరం పట్నం పారిపోయిండు ఈ సంవత్సరం విదేశాలకు పోయిండు ఆడబిడ్డలం మాకు ఆత్మగౌరవం ఉంటుంది. చాలా బాధపడ్డాం.@KTRBRS pic.twitter.com/q5gBj7EW4f