మోహన్ భగవత్‌ అమెరికా పర్యటనకి నేనే అనుమతి ఇప్పించాను: కేఏ పాల్

August 26, 2026
img

ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ అమెరికా పర్యటనపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మోహన్ భగవత్ అమెరికాలో అడుగు పెట్టేందుకు తాను చాలా కీలకంగా వ్యవహరించానని చెప్పుకున్నారు. 

మోహన్ భగవత్ అమెరికా పర్యటనకు ముందు కొన్ని క్రిస్టియన్, ముస్లిం, సిక్కు సంస్థలు  అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు ఫిర్యాదులు చేశాయని తెలిపారు. భగవత్ వీసాను రద్దు చేయాలని వారు కోరారని చెప్పారు.

భగవత్ వీసా విషయంలో నిర్ణయం తీసుకునే అధికారుల్లో ఒకరు నాకు ఫోన్ చేసి ‘ఆయనను అమెరికా పర్యటనకు అనుమతించవచ్చా లేదా?’ అని అభిప్రాయం అడిగారని కేఏ పాల్ చెప్పారు. 

అయితే అమెరిక వంటి ప్రజాస్వామ్య దేశంలో ఆయన పర్యటనను అడ్డుకోవడం సరికాదని నేను చెప్పాను. మతం కారణంగా ఒకరికి అనుమతి నిరాకరిస్తే, రేపు ఇతర మతాలకు అదే వర్తింపజేయాల్సి వస్తుందని, కనుక  మోహన్ భగవత్ అమెరికా పర్యటనకు ఆటంకం కలిగించవద్దని చెప్పాను. అమెరికా పర్యటన విషయంలో అందరికీ ఒకే విధానం ఉండాలని నేను సూచించాను,” అని కేఏ పాల్ చెప్పారు. 

అయితే ఈ నెల 29న అయన అమెరికాలో జరిగే కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు, భారత్‌లో ప్రజాస్వామ్యం ఉందని, ఎప్పటికీ దానిని కాపాడుతామని, మణిపూర్ తరహా ఘటనలు పునరావృతం కాకుండా చూస్తామని చెప్పాలని కేఏ పాల్ సూచించారు. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు శాంతియుతంగా కలిసిమెలిసి జీవించాలని కేఏ పాల్ హితవు పలికారు. 


Related Post