తెలంగాణ ఏర్పడిన తర్వాత కాంగ్రెస్‌లో లుకలుకలు కొనసాగుతూ ఉండేవి. అదే కారణంగా పదేళ్ళపాటు తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రాలేకపోయింది. కానీ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పగ్గాలు చేపట్టిన తర్వాత అందరినీ ఒకే తాటిపైకి తెచ్చి బీఆర్ఎస్ పార్టీని ఓడించి రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలిసారిగా కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చారు. కానీ రెండున్నరేళ్ళలోనే పరిస్థితి మళ్ళీ మొదటికొస్తున్నట్లు కనిపిస్తోంది.
మంత్రి కొండా సురేఖ, మాజీ మంత్రి చిన్నారెడ్డిలపై చర్యలు తీసుకోబోతున్నట్లు క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి చెప్పారు. పార్టీ క్రమశిక్షణ అతిక్రమిస్తే ఎవరికైనా ఇదే పరిస్థితి అని స్పష్టం చేశారు.
అయితే మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ, ధిక్కరిస్తున్నట్లు వ్యవహరిస్తున్నప్పటికీ, కాంగ్రెస్ పార్టీ ఉపేక్షిస్తూనే ఉంది. పైగా మంత్రివర్గ విస్తరణలో ఆయనకి మంత్రి పదవి ఇచ్చే అవకాశం ఉందనే ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి.
మంత్రి కొండా సురేఖ, మాజీ మంత్రి చిన్నారెడ్డిలపై చర్యలు తీసుకోబోతున్నట్లు ప్రకటించారు. కానీ నిజంగా కటిన చర్యలు తీసుకుంటే వారిరువురితో కొత్త సమస్యలు మొదలైతే వాటిని తెలంగాణ కాంగ్రెస్ ఎదుర్కోవలసి వస్తుంది. కనుక తీసుకోగలదా లేదా? అనేది త్వరలో తెలుస్తుంది.