జగమే సంగీతం… ట్రైలర్‌ చూశారా?

August 25, 2026


img

ప్రకాష్ రాజ్ కర్ణాటక శాస్త్రీయ సంగీత విద్వాంసుడుగా చేసిన జగమే సంగీతం వెబ్‌ సిరీస్‌ ట్రైలర్‌ నేడు విడుదలైంది. ఊహించినట్లే ప్రకాష్ రాజ్ ‘శాస్త్రి’పాత్రలో అద్భుతంగా నటించారు. కర్ణాటక సంగీతాన్ని తరతరాలుగా వారసత్వంగా కొనసాగిస్తున్న ఓ కుటుంబం చుట్టూ ఈ కథ తిరుగుతుంది. ప్రముఖ కర్ణాటక సంగీత విద్వాంసుడు ‘శాస్త్రి’ పాత్ర ఈ కథలో కీలకంగా ఉంటుంది. ఈ వెబ్‌ సిరీస్‌లో శ్రీకాంత్,మధుబాల, అక్షయ లగుసాని, శుష్మిత శెట్టి తదితరులు ముఖ్యపాత్రలు చేశారు. 

పల్నాటి సూర్యప్రతాప్ దర్శకత్వంలో రూపొందించిన ‘జగమే సంగీతం’ వెబ్‌ సిరీస్‌ పేరుకు తగ్గట్లుగానే శాస్త్రీయ సంగీతం, త్రికరణ శుద్ధిగా దాని సాధన చేస్తున్న కుటుంబంలో వారసులు, వారి కొత్త ఆలోచనలు, తమ కళతో పేరు, డబ్బు సంపాదించుకోవాలనుకోవడం, ఆ కారణంగా కుటుంబంలో విభేదాలు, శాస్త్రీయ, పాశ్చాత్య సంగీతం మద్య అంతరాలు ఇలా సంగీత ప్రపంచంలో కథ నడుస్తుంది. 

గోల్డ్‌బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సుస్మిత కొణిదెల నిర్మించిన జగమే సంగీతం వెబ్‌ సిరీస్‌కు రచన: పల్నాటి సూర్య ప్రతాప్, వంగల సూర్య మనోజ్, శ్రావణి సముద్రాల; సంగీతం: విశాల్ చంద్రశేఖర్; కెమెరా: రాజ్ తోట; డైలాగ్స్: ఏ.ఆర్. ప్రభవ్; ఆర్ట్: శ్రీనివాస్ నార్ని; ఎడిటింగ్: విప్లవ్ నైశాదం చేశారు. 

జగమే సంగీతం వెబ్‌ సిరీస్‌ సెప్టెంబర్ 4 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది.

<iframe width="560" height="315" src="https://www.youtube.com/embed/tbiXRFXVuMs?si=WCYS_3Fn3efGqD1Q" title="YouTube video player" frameborder="0" allow="accelerometer; autoplay; clipboard-write; encrypted-media; gyroscope; picture-in-picture; web-share" referrerpolicy="strict-origin-when-cross-origin" allowfullscreen></iframe>

Related Post

సినిమా స‌మీక్ష