శివ నిర్వాణ దర్శకత్వంలో రవితేజ, ప్రియ భవాని శంకర్, వారి కుమార్తెగా బేబీ నక్షత్ర నటించిన ఇరుముడి ఆగస్ట్ 21న విడుదలై సూపర్ హిట్ అయ్యింది. ఈ సినిమాపై ప్రేక్షకులతో పాటు సినీ ప్రముఖులు కూడా ప్రశంశలు కురిపిస్తున్నారు. నేషనల్ క్రాష్ రష్మిక మందన కూడా వారిలో ఒకరు. ఆమె ఈ సినిమా చూసిన తర్వాత సోషల్ మీడియాలో ప్రశంశిస్తూ పెద్ద పోస్ట్ పెట్టారు. ఆమె ఏమన్నారో ఆమె మాటల్లోనే..
“నిన్న ‘ఇరుముడి’ సినిమా చూసే అవకాశం లభించింది. సినిమా చాలా అద్భుతంగా ఉంది. ఇరుముడి నా మనసును తాకింది. చిన్న పట్టణాల్లో పిల్లలు పెరిగే సమయంలో ఏదైనా సమస్య ఎదురైతే, జరిగిన విషయాన్ని పెద్దలకు చెప్పడం సహజం.
ఆ వయసులో మనలో ఉండే అమాయకత్వం అది. కానీ క్రమంగా వాస్తవ పరిస్థితులు అర్థమవుతాయి. ఏం జరిగినా మౌనంగా ఉండాలని పెద్దలు చెప్పే పరిస్థితి ఎదురవుతుంది.
‘ఇరుముడి’లో అలాంటి విషయాన్ని ఎంతో సున్నితంగా, అద్భుతంగా చూపించారు. ఇలాంటి కథతో తీసిన ఈ సినిమా నిజంగా నాకు అద్భుతమైన అనుభూతి ఇచ్చింది.
రవితేజ సర్.. మీ ఈ విజయం పట్ల నాకు చాలా సంతోషంగా ఉంది. మీకు హృదయపూర్వక అభినందనలు.
నక్షత్రా.. నువ్వు ఈ సినిమాలో సూర్యకాంతిలా మెరిశావు. నీ చిరునవ్వు కూడా నన్ను చాలా నవ్వించింది. నీకు ప్రత్యేక అభినందనలు.
శివ నిర్వాణ.. ఈ విజయం మీకు పూర్తిగా దక్కాల్సిందే. మీ ఈ విజయం నాకు చాలా సంతోషం కలిగించింది. ఇలాంటి చక్కటి సినిమాను అందించిన చిత్రబృందంలో అందరికీ అభినందనలు,” అని రష్మిక మందన ట్వీట్ చేశారు.