ఇడుపు కాయితంలో శ్రీలతా శ్రీలతా..

August 26, 2026


img

ప్రియదర్శి, కొత్త హీరోయిన్‌ నాగదుర్గ జంటగా చేస్తున్న ‘ఇడుపు కాయితం’ నుంచి ‘శ్రీలతా శ్రీలతా..’ అంటూ సాగే తొలిపాట విడుదలైంది. త్వరలోనే పూర్తిపాట విడుదలవుతుంది. ఈ పాటని తెలంగాణ సచివాలయం ఎదుట చిత్రీకరించారు. 

వంశీ రెడ్డి దొండపాటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో భార్యాభర్తల అనుబంధం ఆ తర్వాత వారి మధ్య మనస్పర్ధలు ఏర్పడటం, చివరికి ‘ఇడుపు కాయితం’ (విడాకులు) వరకు వెళ్ళడం అసలు కథ.

అయితే సినిమా పేరు ‘ఇడుపు కాయితం’ అని ప్రకటించినప్పుడు ఆ పేరుపై చాలా చర్చ జరిగింది. దాని వలన ఇడుపు కాయితం అంటే అర్థం తెలీనివారికి కూడా తెలిసింది. ఇది ఇడుపు కాయితం తొలి విజయమని చెప్పవచ్చు. మరి సినిమా కూడా ‘ఇడుపు కాయితం’ టైటిల్‌ అంత హిట్ అవుతుందా లేదా విడుదలైతే తెలుస్తుంది. 

ఈ సినిమాకు సంగీతం: సురేష్ బొబ్బిలి; కెమెరా: ఎం.ఎన్.బాల్ రెడ్డి, ఎడిటింగ్: శ్రీధర్ సోంపల్లి, కొరియోగ్రఫీ: విజయ్ పోలాకి; పాటలు: అలా రాజు అందించారు.

సుకుమార్ రైటింగ్స్, బీవీ వర్క్స్ బ్యానర్లపై బన్నీ వాస్, వంశీ రెడ్డి దొండపాటి, సురేష్ బొబ్బిలి కలిసి ఈ సినిమా నిర్మిస్తున్నారు.

 <iframe width="560" height="315" src="https://www.youtube.com/embed/GK2axlUeRAY?si=mRU7HMq-7tOZ_EXr" title="YouTube video player" frameborder="0" allow="accelerometer; autoplay; clipboard-write; encrypted-media; gyroscope; picture-in-picture; web-share" referrerpolicy="strict-origin-when-cross-origin" allowfullscreen></iframe>


Related Post

సినిమా స‌మీక్ష