సుమంత్ ప్రభాస్, అనంతిక సనీల్ కుమార్ జంటగా చేస్తున్న ‘రోమాంచకం’ ట్రైలర్ విడుదలైంది. ఈ సినిమాతో వేణుగోపాల్ రెడ్డి దర్శకుడుగా పరిచయం అవుతున్నారు. కొన్ని సన్నివేశాలు ‘జాతి రత్నాలు’ సినిమాని తలపించినా ట్రైలర్ చాలా బాగుంది.
ఈ సినిమాలో ఉపేంద్ర లిమాయే, వెంకటేష్ కాకుమాను, నరేంద్ర రవి, మణి ఏగుర్ల, సాయి సోహన్ తదితరులు ముఖ్యపాత్రలు చేస్తున్నారు.
దర్శకుడు సందీప్ రెడ్డి వంగ, ప్రణయ్ రెడ్డి వంగా సోదరులు నిర్మాతలుగా భద్రకాళి పిక్స్చార్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్న ఈ సినిమాకు కథ, స్క్రీన్‌ప్లే, ఎడిటింగ్, దర్శకత్వం: వేణు గోపాల్ రెడ్డి, సంగీతం: వాసుకి వైభవ్, సినిమాటోగ్రఫీ: పవన్ పప్పుల చేస్తున్నారు. సెప్టెంబర్ 3వ తేదీన రోమాంచకం థియేటర్లలో విడుదల కాబోతోంది.