సహా.. లైఫ్ ఆఫ్ సంజు.. ట్రైలర్‌

August 28, 2026


img

నిషాంత్ దోటి దర్శకత్వంలో శివ కుమార్ కాసారం, శ్వేతా లక్ష్మణ్ జంటగా నటించిన ‘‘సహా... లైఫ్ ఆఫ్ సంజు’ సినిమా ట్రైలర్ విడుదలైంది. 

ఇద్దరి బాల్య స్నేహితుల మధ్య ఏర్పడిన ప్రేమగా మారడం, ఆ తర్వాత వారి జీవితాల్లో చోటుచేసుకునే పరిణామాలు, కాలంతో పాటు పరిస్థితులు మారినప్పుడు వెంటాడే గత జ్ఞాపకాలే ‘సహా... లైఫ్ ఆఫ్ సంజు’ కథాంశం. 

ఈ ట్రైలర్‌ రిలీజ్‌ ఈవెంట్‌లో మాట్లాడిన దర్శక నిర్మాతలు సినిమా తప్పకుండా ప్రేక్షకులను అలరిస్తుందని చెప్పగా, హీరోయిన్‌ శ్వేతా లక్ష్మణ్ మాట్లాడుతూ, “ఈ సినిమా చూసి మెచ్చుకుంటారు లేకుంటే నేను అమీర్ పేట చౌరస్తాలో గుండు గీయించుకుంటాను,” అని అన్నారు. ఆమె మాటలు ఈ సినిమాపై వారి నమ్మకం తెలియజేస్తోంది.           

సుమైరా స్టూడియోస్ బ్యానర్‌పై తేజ వెల్పుచర్ల నిర్మిస్తున్న ఈ సినిమాకు సంగీతం: శేఖర్ చంద్ర, కెమెరా: కరుణాకర్,  ఎడిటింగ్: దినేష్ పెద్ది చేస్తున్నారు. ‘సహా... లైఫ్ ఆఫ్ సంజు’ ఎలా ఉంటుందో సెప్టెంబర్ 4న థియేటర్లలో విడుదలైనప్పుడు తెలుస్తుంది. 


Related Post

సినిమా స‌మీక్ష