ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో యువ హీరో తేజ సజ్జా హీరోగా చేసిన ‘జాంబీరెడ్డి’కి సీక్వెల్గా ‘జాంబీరెడ్డి-2’ వస్తోంది. అయితే దీనిని ప్రశాంత్ వర్మ పర్యవేక్షణలో సుపర్న్ ఎస్ వర్మ దర్శకత్వం చేస్తున్నారు. నేడు విడుదలైన జాంబీరెడ్డి-2 ట్రైలర్ అద్భుతంగా సినిమాపై అంచనాలు పెంచేదిగా ఉంది.
ఈ సినిమాలో తేజ సజ్జా, రియల్ స్టార్ ఉపేంద్ర, షనాయా కపూర్ ముఖ్య పాత్రలు చేస్తున్నారు.
ఈ సినిమాకు కథ: హుస్సేన్ దలాల్, అబ్బాస్ దలాల్, ప్రశాంత్ వర్మ, సుపర్న్ ఎస్. వర్మ, డైలాగ్స్: సుబ్బు కే, సంగీతం: గౌర హరి, సినిమాటోగ్రఫీ: అభినందన్ రామానుజం, ఎడిటింగ్: విజయ్ వెలుకుట్టి చేస్తున్నారు.
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్పై టీజీ విశ్వప్రసాద్, కృతి ప్రసాద్ కలిసి నిర్మిస్తున్న ‘జాంబీరెడ్డి-2’ ‘డెడ్ అర్ అలైవ్’గా 2027లో విడుదల కాబోతోందని టైటిల్ గ్లిమ్స్లో తెలియజేశారు.