బిజీ బిజీగా.. శివాజీ సెకండ్ ఇన్నింగ్స్

October 14, 2026


img

తెలుగు సినీ పరిశ్రమలో ఒకప్పుడు ఫ్యామిలీ హీరోగా మంచి గుర్తింపు సంపాదించుకున్న నటుడు శివాజీ, ఇప్పుడు తన వయసు, మ్యానరిజానికి తగిన సినిమాలు ఎంచుకుంటూ బాగా రాణిస్తున్నారు. తాజాగా బాలాజీ దర్శకత్వంలో శివాజీ ప్రధానపాత్ర చేస్తున్న సినిమా ఎం-3 (వర్కింగ్ టైటిల్‌) నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్‌ విడుదల చేశారు. 

ఈ సినిమాలో ఖుష్బూ, రవికృష్ణ, కసిరెడ్డి తదితరులు ముఖ్యపాత్రలు చేస్తున్నారు.  ఇటీవలే ఈ సినిమా షూటింగ్‌ కూడా పూర్తయింది. ప్యాచ్ వర్క్స్, పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తిచేసి డిసెంబర్‌లో ఈ సినిమా విడుదల చేసేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు.

ఈ యూత్ ఫుల్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లో మంచి కామెడీతో పాటు సమాజానికి ఓ చక్కటి సందేశం కూడా ఉంటుందని ఈ సినిమా దర్శకుడు బాలాజీ తెలిపారు. త్వరలోనే సినిమా టైటిల్‌, ఫస్ట్ గ్లిమ్స్‌ విడుదల చేసి ఆ తర్వాత వరుసగా పాటలు, టీజర్‌, ట్రైలర్‌ విడుదల చేస్తామని చెప్పారు. ఈ సినిమాను ఎస్‌టిబిఎల్ సినిమాస్ బ్యానర్‌పై నిర్మిస్తున్నట్లు బాలాజీ తెలిపారు. 


Related Post

సినిమా స‌మీక్ష