ప్రముఖ సినీ నటుడు గౌతమ్ రాజు కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నట్లు ఓ సినీ మ్యాగజైన్ ప్రచురించిన వార్తపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
నేను పూర్తి ఆరోగ్యంగా ఉన్నాను. నేటికీ సినిమాలు, సీరియళ్లలో నటిస్స్తూతూనే ఉన్నాను. కానీ ఓ సినీ పత్రిక తన ఫేస్బుక్ ఖాతాలో నేను నేను కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నానని పోస్ట్ పెట్టింది.
నేను ఆ పత్రికకు ఎలాంటి ఇంటర్వ్యూ ఇవ్వలేదు. మరి నా ఆరోగ్యం గురించి నిర్ధారణ చేసుకోకుండాఇలాంటి తప్పుడు వార్తలు ప్రచురించడం వల్ల నా కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు ఆందోళన చెందుతున్నారు.
నేను ఘరానా మొగుడు, వినోదం, ప్రేమకు వేళాయెరా వంటి వందలాది సినిమాల్లో నటించాను. వాటితో మంచి నటుడుగా గుర్తింపు కూడా తెచ్చుకున్నాను. కానీ నా సినిమాల గురించి కూడా అది తప్పుగా రాయడం నాకు చాలా బాధ కలిగించింది.
నిర్ధారించుకోకుండా ఇలాంటి తప్పుడు వార్తలు ప్రచారం చేయడం సరికాదు. నా ఆరోగ్యం గురించి పెట్టిన ఆ తప్పుడు పోస్టును తక్షణం తొలగించాలి," అని గౌతమ్ రాజు ఆ పత్రిక సంపాదకుడికి విజ్ఞప్తి చేశారు.