నవంబర్‌ నుంచి మారుతి కొత్త సినిమా షూటింగ్‌

October 14, 2026


img

ప్రభాస్‌ వంటి పాన్ ఇండియా స్టార్ హీరోగా తెరకెక్కిన ‘ది రాజా సాబ్‌’ ఫ్లాప్ అవడంతో దర్శకుడు మారుతి తీవ్ర  విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది. అప్పటి నుంచి కొత్త సినిమా చేయకుండా కథలు సిద్ధం చేసుకుంటున్నారు.

ఎట్టకేలకు ఓ కథ సిద్ధం చేసుకొని మళ్ళీ తన శైలిలో కొత్త నటీనటులతో కామెడీ ఎంటర్‌టైనర్‌ తీసేందుకు సిద్దం అవుతున్నారు. ప్రస్తుతం ఈ సినిమా కోసం ప్రీ-ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. కనుక నవంబర్‌ నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్‌ ప్రారంభించేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. 

మారుతి తన కెరీర్‌ను ఏవిధంగా బస్‌ స్టాప్‌ వంటి చిత్రాలతో మొదలు పెట్టారో ఇప్పుడూ అదేవిధంగా సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించబోతున్నారు. 

నవంబర్‌లో షూటింగ్‌ ప్రారంభించి వచ్చే ఏడాది మార్చి లేదా వేసవి సెలవుల సమయంలో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మారుతి ప్లాన్ చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. 



Related Post

సినిమా స‌మీక్ష