బుచ్చిబాబు సనా దర్శకత్వంలో రామ్ చరణ్, జాన్వీ కపూర్ జంటగా చేస్తున్న ‘పెద్ది’ నుంచి ‘రయ్ రయ్ రారా...’ అంటూ సాగే రెండో పాట సోమవారం విడుదలైంది. చెరుకు క్రషర్ ఫ్యాక్టరీ నేపధ్యంలో చిత్రీకరించిన ఈ పాటకి ఎప్పటిలాగే రామ్ చరణ్ చాలా హుషారుగా డాన్స్ చేశారు. అనంత్ శ్రీరామ్ వ్రాసిన ఈ పాటని ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రహమాన్ స్వరపరిచి స్వయంగా పాడారు.
ఈ సినిమాలో రామ్ చరణ్‌కు జోడీగా జాహ్నవీ కపూర్ నటిస్తుండగా, కోచ్ ‘గౌరు నాయుడు’గా కన్నడ నటుడు శివరాజ్ కుమార్ నటిస్తున్నారు. ఈ సినిమాలో జగపతి బాబు, శివ రాజ్ కుమార్, దివ్యేంద్రు తదితరులు ముఖ్య పాత్రలు చేస్తున్నారు.
ఈ సినిమాకి సంగీతం: ఏఆర్ రహమాన్, కెమెరా: రత్నవేలు, ఎడిటింగ్: నవీన్ నూలి అందిస్తున్నారు.
వృద్ధి సినిమాస్, సుకుమార్ రైటింగ్స్, మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్లపై వెంకట సతీష్ కిలారు దీనిని పాన్ ఇండియా మూవీగా 5 భాషల్లో నిర్మిస్తున్నారు. ఏప్రిల్ 30న పెద్ది ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది.