సాక్ష్యాధారాలు లేనందునే బయటపడ్డారు: బిజేపి

February 27, 2026


img

లిక్కర్ స్కాం కేసులో ఢిల్లీ కోర్టు కల్వకుంట్ల కవితకు క్లీన్ చిట్ ఇవ్వడంపై బిజేపి ఎంపీ ధర్మపురి అరవింద్ కుమార్‌ స్పందిస్తూ, “కోర్టు ఏం చెప్పింది. సీబీఐ సరైన సాక్ష్యాధారాలు చూపలేకపోయిందని. వారికి వ్యతిరేకంగా సీబీఐ సాక్ష్యాధారాలు సమర్పించి ఉండి ఉంటే అందరూ లోపల ఉండేవారు. కానీ చూపలేకపోయింది కనుక బయటపడ్డారు.      ఇది లీగల్ ప్రాసెస్‌లో ఓ భాగం మాత్రమే. ఈ కేసుతో బిజేపికి, కేంద్ర ప్రభుత్వానికి ఎటువంటి సందమూ లేదని మొదటి నుంచి చెపుతూనే ఉన్నాము. పూర్తి సాక్ష్యాదారాలున్న ఓటుకు నోటు కేసులోనే రేవంత్ రెడ్డిని ఏమీ చేయలేకపోతే, సాక్ష్యాధారాలు లేకుండా కల్వకుంట్ల కవితని ఎవరేం చేయగలరు? ఆమె జైల్లో ఉన్నా బయట ఉన్నా  తెలంగాణ రాష్ట్రానికి, బిజేపికి ఫరక్ పడదు,” అని అన్నారు.   



Related Post