కిషోర్ పాండురంగ దర్శకత్వంలో విజయ్ సేతుపతి, అరవింద్ స్వామి, అదితీ రావు హైదరీ ప్రధాన పాత్రలు చేసిన ‘గాంధీ టాక్స్’ జనవరి 30న థియేటర్లలో విడుదలై ప్రేక్షకులను మెప్పించింది. ఇప్పుడీ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోలోకి వచ్చేసింది.
క్లుప్తంగా కథ: ముంబాయి దారావీ మురికివాడలో నివసించే మహదేవ్ విష్ణు (విజయ్ సేతుపతి)కి, వ్యాపారంలో తీవ్రంగా నష్టపోయి రోడ్డున పడ్డ బోస్ మాన్ (అరవింద స్వామి) తమ కష్టాల నుంచి బయటపడేందుకు సులువుగా డబ్బు సంపాదించే ప్రయత్నం చేస్తారు.
భిన్న ఆర్ధిక నేపధ్యాలు కలిగిన వారిద్దరూ ఏవిధంగా కలిశారు? ఏం చేశారు? వారి ప్రయత్నాలు ఫలించాయా లేదా? అనేదే ఈ సినిమా కథ. మంచి స్క్రీన్ ప్లేతో ఈ కథని సినిమాగా రక్తి కట్టించారు దర్శకుడు కిషోర్ పాండురంగ.
థియేటర్ ప్రేక్షకులు మెచ్చిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులకు అందుబాటులో ఉంది. కానీ దీనిని చూడాలంటే గాంధీ టాక్స్ రూ.279 చెల్లించాల్సి ఉంటుంది. కొన్ని రోజుల తర్వాత అందరికీ ఉచితంగా అందుబాటులోకి వస్తుంది.