కార్తీక్ దండు-నాగ చైతన్య కాంబినేషన్‌లో సిద్దం చేస్తున్న ‘వృషకర్మ’ ఫస్ట్ గ్లిమ్స్ మార్చి మొదటి వారంలో ఉండవచ్చని ముందే అనుకున్నాము. అదేవిధంగా మార్చి 5న ఫస్ట్ గ్లిమ్స్ విడుదల చేయబోతున్నట్లు నాగ చైతన్య స్వయంగా ట్వీట్ చేశారు. ‘వృషకర్మ’ అంటే కార్యసాధకుడు. ఓ దట్టమైన అడవిలో నిధి కోసం సాగే సాహసోపేతమైన అన్వేషణే ఈ సినిమా కధ. దీనిలో హీరోయిన్‌గా చేస్తున్న మీనాక్షి చౌదరి ‘ఆర్కియాలజిస్ట్’ గా నటిస్తున్నారు. బాలీవుడ్ నటుడు స్పర్ష్ శ్రీవాత్సవ్ (‘లాఫతా లేడీస్) ఈ సినిమాలో ఓ ముఖ్య పాత్ర చేస్తున్నాడు.
ఈ సినిమాకు కధ, దర్శకత్వం: కార్తీక్ దండు, స్క్రీన్ ప్లే: సుకుమార్, సంగీతం: అజనీష్ బి లోక్‌నాధ్, కెమెరా: నైల్ డి కునహా, ఎడిటింగ్: నవీన్ నూలి చేస్తున్నారు.
బాపినీడు సమర్పణలో శ్రీ వేంకటేశ్వర సినీ చిత్ర, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లపై బివిఎస్ఎన్ ప్రసాద్ ఈ సినిమా నిర్మిస్తున్నారు. ఈ సినిమా నిర్మాణంలో సుకుమార్ రైటింగ్స్ కూడా భాగస్వామిగా ఉండటంతో భారీ అంచనాలున్నాయి. ఈ వేసవిలో సినిమా విడుదలయ్యే అవకాశం ఉంది.