విరోషా రణబాలి సెప్టెంబర్ 11న రిలీజ్

February 25, 2026


img

రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ, రష్మిక మందన జంటగా చేస్తున్న ‘రణబాలి’కి అప్పుడే రిలీజ్ డేట్ వచ్చేసింది. సెప్టెంబర్ 11న రణబాలి విడుదల చేయబోతున్నట్లు తెలియజేస్తూ విజయ్ దేవరకొండ పోస్టర్ వేశారు. దానిలో విజయ్ దేవరకొండ నుదుట విభూతి రేఖలు, మొహానికి పసుపు, మెళ్ళో రుద్రాక్ష మాలలతో చాలా రౌద్రంగా చూస్తున్నట్లు ఉంది. ఈ సినిమాలో దక్షిణాఫ్రిక నటుడు ఆర్నాల్డ్ వొస్లూ కూడా చేరారు. 

బ్రిటిష్ కాలంలో రాయలసీమలో జరిగిన స్వాతంత్ర్య పోరాటాలతో ఈ సినిమా రూపొందిస్తున్నారు. దీనిలో ఆర్నాల్డ్ వస్లూ బ్రిటిష్ అధికారిగా నటించబోతున్నారు.  

ఈ సినిమాకు కథ: ప్రమోద్ తమ్మినేని, సంగీతం: అజయ్-అతుల్, కెమెరా: నీరవ్ షా, ఎడిటింగ్: కార్తిక శ్రీనివాస్‌, ఆర్ట్: వితల్ కొసనం, స్టంట్స్: యానిక్ బెన్, అండీ లాంగ్ గుయెన్, రాబిన్ సుబ్బు చేస్తున్నారు.  

గుల్షన్ కుమార్‌, భూషణ్ కుమార్‌ సమర్పణలో మైత్రీ మూవీ మేకర్స్, టీ సిరీస్ బ్యానర్లపై నవీన్ ఎర్నేని, రవి శంకర్ కలిసి 5 భాషల్లో రణబాలి నిర్మిస్తున్నారు. సెప్టెంబర్ 11న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. 


Related Post

సినిమా స‌మీక్ష