కేరళ పేరు మారింది! ఇకపై కేరళం!

February 24, 2026


img

దేశంలో ఇప్పటికే పలు రాష్ట్రాలు, నగరాలు, జిల్లాల పేర్లు మారాయి. తాజాగా కేరళ రాష్ట్రం పేరు మారబోతోంది. కేరళ పేరుని ‘కేరళం’గా మార్చాలని ఆ రాష్ట్ర శాసనసభలో 2024,  జూన్ 24న ఓ తీర్మానం ఆమోదించింది. అంతకు ముందు కూడా ఒకటి రెండుసార్లు తీర్మానాలు ప్రవేశపెట్టారు.

తాజా తీర్మానాన్ని కేంద్ర ప్రభుత్వానికి పంపించగా, ఇటీవల ప్రధాని మోడీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో ఈ ప్రతిపాదనకు ఆమోదముద్ర వేశారు. కనుక త్వరలో పార్లమెంట్లో ఈ మేరకు బిల్లు పెట్టి ఆమోద ముద్ర వేయడం, దానికి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్మూ ఆమోద ముద్ర వేయడం లాంచన ప్రాయమే. ప్రస్తుత బడ్జెట్‌ సమావేశాలలోనే ఈ ప్రక్రియ పూర్తవుతుంది. కనుక ఇకపై కేరళ కాదు... కేరళం అని పలకాలి. వ్రాసుకోవాలి.


Related Post