పుష్పగాడి రూలింగ్ ఇంకా సాగుతూనే ఉంది

February 22, 2026


img

కేరళలో శనివారం జరిగిన 70వ ఫిల్మ్ ఫేర్ అవార్డుల కార్యక్రమంలో పుష్ప-2 సినిమాకి, దానిలో నటించిన అల్లు అర్జున్‌కి, ఆ సినిమాకి దర్శకత్వం వహించిన సుకుమార్‌కి అవార్డులు వచ్చాయి. 2024లో విడుదలైన తెలుగు సినిమాలలో అవార్డులు దక్కిన్చుకునవి ఇవే... 

పుష్ప-2: ఉత్తమ చిత్రం, బెస్ట్ మ్యూజిక్, ఉత్తమ దర్శకుడు (సుకుమార్) , ఉత్తమ నటుడు (అల్లు అర్జున్‌), బెస్ట్ ప్రొడక్షన్ డిజైన్ (రామకృష్ణ, మోనిక).  

కమిటీ కుర్రోళ్ళు: ఉత్తమ పరిచయ దర్శకుడు (యదు వంశీ), ఉత్తమ పరిచయ నటుడు (సందీప్ సరోజ్). 

కల్కి ఏడీ2898: ఉత్తమ సహాయ నటుడు (అమితాబ్ బచ్చన్), బెస్ట్ ప్రొడక్షన్ డిజైన్ (నితిన్‌ జిహానీ).

గంగం గణేశా: ఉత్తమ పరిచయ నటి (నయన్ సారిక).

గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి: ఉత్తమ సహాయ నటి (అంజలి). 

దేవర: ఉత్తమ సాహిత్యం (చుట్టమల్లె చుట్టేస్తోంది) (రామజోగయ్య శాస్త్రి). 

గుంటూరు కారం: ఉత్తమ గాయకుడు (శ్రీకృష్ణ) ఉత్తమ కోరియోగ్రఫీ: శేఖర్ మాస్టర్ (కుర్చీ మడత పెట్టి).    

చుట్టమల్లె: ఉత్తమ గాయని (శిల్పారావు). 

క్రిటిక్స్ అవార్డ్స్: ఉత్తమ నటుడు (తేజా సజ్జా), ఉత్తమ నటి: కాజల్ అగర్వాల్ (సత్యభామ). 


Related Post

సినిమా స‌మీక్ష