ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో ప్రముఖ కన్నడ నటుడు రిషబ్ శెట్టి ప్రధాన పాత్ర చేస్తున్న ‘జై హనుమాన్’ సినిమాక అదివారం హంపిలో పూజా కార్యక్రమంతో లాంచనంగా ప్రారంభమైంది. హంపిలోని అంజనాద్రి బెట్ట ఆలయ ఆవరణలో జరిగిన ఈ కార్యక్రమంలో రిషబ్ శెట్టి దంపతులు, దర్శకుడు ప్రశాంత్ వర్మ, నటుడు తేజా సజ్జా తదితరులు పాల్గొన్నారు.
ఇది తేజాసజ్జా-ప్రశాంత్ వర్మ కాంబినేషన్‌లో వచ్చిన హనుమాన్ సినిమాకు సీక్వెల్. దీనిలో కూడా తేజా సజ్జా హనుమంత్‌గా నటిస్తున్నాడు. రిషబ్ శెట్టి హనుమంతుడుగా నటిస్తున్నారు. ఈ సినిమాలో దౌఉబాతి రానా కూడా ఓ ముఖ్యపాత్ర చేయబోతున్నట్లు తెలుస్తోంది. అలనాడు శ్రీరాముడుకి హనుమంతుడు ఒక మాట ఇస్తాడు. అది ఏమిటి? ఆ మాట నిలబెట్టుకోవడానికి ఏం చేశాడు? అనేది ఈ సినిమా కధ.
The versatile actor #RishabShetty arrives for the pooja ceremony of the magnum opus #JaiHanuman at the Anjanadri Betta in Hampi ❤️🔥 pic.twitter.com/b2AzozrIR8
— 𝐕𝐚𝐦𝐬𝐢𝐒𝐡𝐞𝐤𝐚𝐫 (@UrsVamsiShekar) February 22, 2026