జగిత్యాలలో బిజేపి నేత అనుమానాస్పద మృతి

February 22, 2026


img

జగిత్యాల జిల్లాలో రమణ అనే బిజేపి నేత అనుమానాస్పద స్థితిలో చనిపోయారు. మూడు రోజుల క్రితమే పెగడపల్లి పోలీస్ స్టేషన్‌లో ఆయన మిస్సింగ్ కేసు నమోదు కావడంతో పోలీసులు ఆయన కోసం గాలిస్తున్నారు. జిల్లాలోని పెగడపల్లి మండలం సుద్దపల్లి సమీపంలో గల వరద కాలువలో శనివారం ఆయన మృతదేహం బయటపడింది. స్థానికులిచ్చిన సమాచారంతో పోలీసులు అక్కడకు చేరుకొని మృతదేహాన్ని బయటకు తీసి పోస్టుమార్టంకు పంపారు. 

గతంలో బీఆర్ఎస్‌ పార్టీ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్‌గా చేసిన అయన ఇటీవల పంచాయితీ ఎన్నికలలో బిజేపి మద్దతుతో పోటీ చేసి స్వల్ప తేడాతో ఓడిపోయారు. కనుక ఆయన ఆత్మహత్య చేసుకున్నారా లేదా ఎవరైనా హత్య చేసి కాలువలో పడేశారా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 


Related Post