బిజేపి రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్ రావుని హైదరాబాద్, తార్నాక వద్ద పోలీసులు అరెస్ట్ చేశారు. అయన కామారెడ్డిలోని బాన్సువాడకు బయలుదేరేందుకు సిద్ధమయ్యారు. కానీ ప్రస్తుతం అక్కడ కాంగ్రెస్, బిజేపిల మద్య యుద్ధవాతావరణం నెలకొని ఉండటంతో పోలీసులు వారించారు. కానీ రాంచందర్ రావు ఎట్టి పరిస్టితులలో బాన్సువాడకు వెళ్తానని ప్రకటించడంతో గృహ నిర్బంధం చేశారు.
కామారెడ్డిలో బిజేపి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణారెడ్డి, సీనియర్ కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ మద్య చిన్నగా మొదలైన వాదోపవాదాలు సవాళ్ళు, ప్రతి సవాళ్ళకు దారితీసింది. ఈరోజు జిల్లా కలెక్టరేట్ కార్యాలయం వద్ద తాడోపేడో తేల్చుకుందామని సవాళ్ళు విసురుకున్నారు. దీంతో కామారెడ్డి రెండు పార్టీల శ్రేణుల మద్య ఘర్షణ వాతావరణం నెలకొంది.
అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొని ఉన్నప్పుడు రాంచందర్ రావు వెళితే సమస్య ఇంకా పెద్దదవుతుందని పోలీసులు వారించారు. కానీ వినకుండా బయలుదేరడానికి సిద్దపడటంతో గృహ నిర్బంధం చేశారు. ఆయన అరెస్టుని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఈటల రాజేందర్ తదితరులు ఖండించారు.